శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (15:41 IST)

మరింత స్టయిలిష్ మహేష్...! ఇంట్రో సాంగ్‌లో ప్రిన్స్ స్టెప్పులు...!

ప్రిన్స్ మహేష్ బాబు అంటేనే స్టైల్. ఒక్కో సినిమాకు డిఫరెంట్ స్టైల్స్‌తో మహేష్ అభిమానులను మంతముగ్దుల్ని చేస్తుంటాడు. అందునా ఆయన సినిమాల్లో పరిచయ గీతాలు చాలా కొత్తగా ఉంటాయి. అభిమానులు కూడా వాటిని ఆస్వాదిస్తుంటారు. 
 
ఆ విధంగా 'ఒక్కడు'లో 'హరేరామ... ', 'పోకిరీ'లో 'జగడమే...', 'బిజినెస్ మాన్' లో 'ముంబయ్...' పాటలు చాలా పాప్యులర్ అయ్యాయి. ప్రస్తుతం అదే రీతిలో కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాలో మహేష్ పై అటువంటి ఓ పాటను ప్లాన్ చేశారు. 
 
జోరుగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం ప్రారంభమైంది. అక్కడ మహేష్, కొంతమంది డాన్సర్లపై ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. 
 
కాగా గతంలో వంటిన ఇంట్రో పాటల్లో కంటే కూడా ఈ పాటలో ప్రిన్స్ మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారట. ఇది ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఇంట్రో సాంగ్ అవుతుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.