శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (08:43 IST)

జబర్దస్త్ వేణు అరెస్ట్.. గౌడ కులాన్ని కించపరిచిన కేసులో...

తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు వేణును అదుపులోకి తీసుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో గౌడ కులాన్ని కించపరిచారంటూ కేసు నమోదు చేశారు.
 
వేణుపై ఇటీవల ఓ కుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు.
 
ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ద్వారా వేణు బాగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. అయితే, ఎంతో పాప్యులర్ అయిన 'జబర్దస్త్' టీవో షోలో ఓ కులాన్ని కించపరచారంటూ ఇటీవల వివాదం రేగడం తెలిసిందే. ఈ క్రమంలో ఫిలింనగర్లో ఇటీవల వేణుపై కొందరు దాడి చేయడం విదితమే. ఆ దాడిలో వేణు గాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు కూడా. అయితే, ఇపుడు వేణును పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.