శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (17:41 IST)

జాక్వేలిన్ ఫెర్నాండెజ్: అజారుద్దీన్ బయోగ్రఫీలో నటిస్తుందా?

ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ బయోగ్రఫీ వెండితెరపై రానుంది. అయితే ఈ సినిమాలో సంగీతా బిజిలానీ పాత్ర ఎవరు పోషిస్తారన్న విషయంపై బాలీవుడ్‌లో చర్చ జరిగింది. ఎందుకంటే, అజార్ జీవితంలో సంగీతాకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఆ పాత్రకు మొదట్లో కరీనా కపూర్‌ను అనుకున్నారు. 
 
ఆమెకు కూడా చేయాలని ఉన్నప్పటికీ, డేట్స్ క్లాష్ వల్ల 'నో' చెప్పింది. దాంతో ఈ పాత్రకు తాజాగా శ్రీలంక బ్యూటీ జాక్వేలిన్ ఫెర్నాండెజ్‌ను దర్శకుడు ఆంథోనీ డిసౌజా ఎంపిక చేసినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు ఇస్తోంది. ఇమ్రాన్ హాష్మి ఇందులో అజార్ పాత్ర పోషిస్తున్నాడు.