శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (14:32 IST)

‘జాదూగాడు’ విడుదలకు సిద్ధం.. తేదీ ఖరారు..

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'జాదూగాడు'. యోగేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన సోనారిక హీరోయిన్‌గా నటిస్తుంది. వి.వి.యన్ ప్రసాద్ నిర్మాణంలో వస్తున్న ఈ యాక్షన్ మూవీని జూన్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు యోగేష్ మాట్లాడుతూ ‘నాగ శౌర్య ఇప్పటి వరకు ప్రేమ కధా చిత్రాల్లో నటించారు. కానీ, ఈ చిత్రంలో లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో కనిపిస్తారన్నారు. హీరోయిన్ సోనారికతో ప్రేమలో పడిన తరువాత లోకల్ గ్యాంగ్ లీడర్‌తో ఏర్పడే గొడవలు అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది అని చూపిస్తుందని వివరించారు.
 
ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.