శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2015 (20:26 IST)

'జిల్' శాటిలైట్ రైట్స్ 4 కోట్లు

తాజాగా ప్రముఖ టీవీ చానల్ గోపీచంద్‌ సినిమా 'జిల్‌'ను కొనేసింది. అంతకుముందు లౌక్యంకు ముందు సినిమాను కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సక్సెస్‌ తర్వాతే ఛానల్‌ ముందుకు రావడం విశేషం. గోపీచంద్‌ ఫైర్‌ ఆఫీసర్‌‌గా కనిపించిన ఈ సినిమాలో గోపీచంద్‌ ఎన్నడూ లేనంత స్టైలిష్‌‌గా కనిపించాడు. రాశి ఖన్నా హీరోయిన్‌‌గా నటించిన ఈ సినిమాని యువి క్రియేషన్స్‌ వారు నిర్మించారు.
 
కాగా, శాటిలైట్‌ రైట్స్‌ కోసం 4.75 కోట్లను ఆ ఛానల్‌ వెచ్చించింది. గోపీచంద్‌ సినిమాకి ఇంత మంచి రేటు రావడంతో యువి క్రియేషన్స్‌ వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా మిర్చి నిర్మాతలు అంతకుముందు తీసిన రన్‌రాజారన్‌, మిర్చి సినిమా ఎఫెక్ట్‌ కూడా వుండవచ్చని తెలుస్తోంది.