బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (20:50 IST)

కోట్ల క్లబ్‌లోకి ఎన్‌టిఆర్‌

ఎన్‌టిఆర్‌ రభస చిత్రం తర్వాత కోట్ల క్లబ్‌ మాట దేవుడెరుగు. అసలు మోస్తరు విజయం వస్తే చాలని ఆయన సన్నిహితులు కూడా చెబుతుండేవారు. కానీ ఒక్కసారిగా టెంపర్‌తో అంచనాలు తారుమారయ్యాయి. ఊహించినదానికంటే సక్సెస్‌ ఇవ్వడంతో చాలా ఉత్సాహంలో ఎన్‌టిఆర్‌ వున్నారు. 
 
ఇటీవలే ఏ పెద్ద చిత్రాన్ని అయినా కోట్ల క్లబ్‌లో ఎనలైజ్‌ ఏస్తున్నారు. టెంపర్‌ కలెక్షన్ల పరంగా 40 కోట్లకు చేరిందని, ఇంకా ఎక్కువవుతుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత బండ్ల గణేష్‌ అయితే చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా విందు ఏర్పాటు కూడా చేశాడు. సక్సెస్‌లు వచ్చినప్పుడు ఇటువంటివి చేసుకుంటేనే పనిచేసిన వారికి ఎనర్జీ వస్తుందని చెబుతున్నాడు కూడా.