శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:01 IST)

నాగబాబుకు నటి హేమ సవాల్... రూ. 5 కోట్లిస్తే అందరం విత్‌డ్రా అవుతాం...

క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ మరోసారి నాగబాబుపై సవాల్ విసిరారు. మొన్న నాగబాబు ఓ చానల్ లో తాము మా అసోసియేషన్ కోసం రూ. 5 కోట్లిస్తామని రాజేంద్రప్రసాద్‌కు వత్తాసు పలికారనీ, వాళ్లు నిజంగానే ఇప్పటికిప్పుడు రూ. 5 కోట్లు 'మా'లో జమ చేస్తే తామంతా ఉన్నఫళంగా విత్ డ్రా అవుతామని ఆవేశంగా మాట్లాడారు. 
 
హేమ అలా మాట్లాడగానే ఆమె వద్ద నుంచి మైకు లాక్కున్న నటి జయసుధ... హేమ ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతోంది కానీ... తాము ఎట్టి పరిస్థితుల్లో పోటీ నుంచి వెనక్కి వెళ్లేది లేనే లేదని స్పష్టం చేశారు. మొత్తమ్మీద ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు మహా రచ్చగా మారిపోయాయి.