గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (15:06 IST)

ఎన్టీఆర్‌ టెంపర్: పోని వర్మ ట్వీట్.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ హల్‌చల్!

జూనియర్‌ ఎన్టీఆర్‌, కాజల్‌, పూరి జగన్నాథ్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘టెంపర్‌’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ భార్య పోని వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. అంతేగాకుండా..  ఎడిటింగ్‌ రూమ్‌ నుంచే ఈ ఫోటోలను పెడుతున్నట్లు ట్వీట్‌ చేసింది. 
 
ఏది ఏమైనా.. చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. తప్పకుండా ఈ సినిమాకు మాస్ ఫాలోయింగ్ లభిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ సినిమాకి బండ్ల గణేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు.