గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: బుధవారం, 23 జులై 2014 (12:20 IST)

జూనియర్ ఎన్టీఆర్‌ పుత్రోత్సాహం ట్విట్టర్‌ ట్వీట్ ఆనందం

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం 11 గంటలకు పండంటి మగపిల్లాడు పుట్టిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పుత్రోత్సాహంలో తన ఆనందాన్ని ట్విట్టర్‌లో ట్వీట్ ఇచ్చారు. ట్విట్టర్ ఖాతాను 2009లో ఓపెన్ చేసి 2010 నుంచి అందులో ఏమీ పోస్టు చేయని జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పుట్టగానే ట్వీట్ ఇచ్చుకున్నాడు.
 
జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. ట్విట్టర్‌కు ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉంటున్నా. ఐతే ఇప్పుడు కొడుకు పుట్టిన ఆనందాన్ని ఈ ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీ అందరితో పంచుకుంటున్నాను. మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.