గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (16:31 IST)

జూ. ఎన్టీఆర్‌కు ‘టెంపర్’ ఎక్కువేనట.. అందుకే దండయాత్ర!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా ఆడియో బుధవారం విడుదలైంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బాగా ‘టెంపర్’ ఉన్న పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని కష్టపడికాకుండా కసితో చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, సినీ కెరీర్‌లో నేను హిట్‌ ప్లాప్‌ అనేవీ పట్టించుకోను. మీకునచ్చే వరకు సినిమాలు చేస్తూనే వుంటా అని నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. 
 
ఆయన నటించిన 'టెంపర్‌' ఆడియో విడుదల బుధవారం శిల్పకళావేదికలో ఆర్భాటంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ భార్యబిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో అభిమానుల్ని అంత ప్రేమగా చూసుకోవాలి. నేనిప్పుడు రెండు కాళ్ళపై నిలబడ్డానంటే దానికి కారణం మీరే. తాత, అభిమానులు లేనిదో నాకీ  బతుకులేదన్నారు.
 
నందమూరి అభిమాని కాలర్‌ ఎత్తుకుని తిరగాలనేదే నా కోరిక. అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ జనవరిలో పటాస్‌తో మొదలెట్టాడు. ఇప్పుడు టెంపర్‌ వస్తోంది. నేనింతవరకూ కష్టపడి చేశాను. కానీ ఈ సినిమా కసితో చేశాను అన్నారు. అంతేకాకుండా.. ఈ సినిమా తర్వాత. బాలయ్య బాబాయ్‌ 'లయన్‌' వస్తుంది. రాసిపెట్టుకోంది. ఇది నందమూరి నామసంవత్సరం అని అభిమానులు హర్షాతిరేకులమధ్య మాట్లాడారు. ఇంకా మాట్లాడుతూ 11 ఏళ్ళ తర్వాత పూరీతో సినిమా చేస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ ఆయన వర్కింగ్‌ శైలి మారలేదు. కానీ సినిమా మాత్రం మారుతోందన్నారు. 
 
ఇకపోతే పూరీ జగన్నాథ్ స్పందిస్తూ.. 2004లో ఆంధ్రావాలాతీశాను. నందమూరి ఫ్యాన్స్‌ తిట్టుకున్నారు. ఇప్పుడు టెంపర్‌ చేశాను నన్ను నమ్మండి. గత ఎన్‌టిఆర్‌ సినిమాలన్నీ మర్చిపోతారు. ఇందులో సిక్స్‌ ప్యాక్‌ కోసం ఎన్‌టిఆర్‌ 18 గంటలు నీళ్లు కూడా తాగలేదు. అంకితభావంతో పనిచేశారని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే పటాస్ హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తమ్ముడు అభిమానుల కోసం మనస్సు ప్రాణం పెట్టి సినిమా చేశారన్నారు. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం వాల్‌పోస్టర్లలో జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆవేశంగా, కోపంగా కనిపిస్తున్నారు.