బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2014 (12:05 IST)

జ్యోతిక ''హౌ ఓల్డ్ ఆర్యూ'' రెడీ ఫర్ షూటింగ్!

తమిళ హీరో సూర్య సతీమణి, ఒకప్పటి కథానాయిక జ్యోతిక రీ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న జ్యోతికకు మంచి సబ్జెక్ట్ దొరకడంతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 
 
మలయాళంలో వచ్చిన 'హౌ ఓల్డ్ ఆర్యూ' చిత్రాన్ని జ్యోతిక కథానాయికగా తమిళంలో ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ దర్శకుడు రోషన్ ఆండ్రూ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో జ్యోతిక భర్తగా సీనియర్ నటుడు రెహ్మాన్ నటిస్తున్నాడు. 
 
చెన్నై, ఢిల్లీ పరిసరాల్లో షూటింగ్ నిర్వహిస్తారు. కాగా, నవంబర్ 17నుంచి ఈ సినిమా షూటింగులో జ్యోతిక పాల్గొంటుంది. కొన్నేళ్ల క్రితం తాను నటించిన 'చంద్రముఖి' సినిమా ద్వారా ఆమె ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసింది.