బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 15 డిశెంబరు 2014 (20:09 IST)

ప్రముఖ దర్శకుడు కె బాలచందర్‌ కు తీవ్ర అస్వస్థత... కమల్ వాకబు

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు కె.బాలచందర్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. తన స్వగృహంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనవడంతో వెంటనే ఆయనను కుటుంబసభ్యులు కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. 84 సంవత్సరాల వయసున్న బాలచందర్ వయసురీత్యా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. బాలచందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనలోనే ఉన్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా బాలచందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు శ్వాసకోశ సమస్యలతో పాటు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దీంతోనే ఆయన కావేరి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. అయితే, సోమవారం ఉదయం ఉన్నట్టుండి బాలచందర్ ఆరోగ్యం విషమించింది. ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.
 
విశ్వవిఖ్యాత నటుడు కమల్హాసన్ తన గురువుగా బాలచందర్ను అభివర్ణిస్తారు. రజనీకాంత్, కమల్హాసన్, ప్రకాష్ రాజ్ వంటి అనేకమంది ప్రముఖ నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్దే. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే కమల్హాసన్ ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.