మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (19:16 IST)

ఫ్యాన్స్‌పై కాజల్ అగర్వాల్ ప్రశంసలు: సరకు లేకుంటే?

సినీ నటి కాజల్ అగర్వాల్‌కు ఏమైందో కానీ.. ఫ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. అభిమానులు అమాయకులు కాదని, వారు తెలివితో వ్యవహరిస్తారని కొనియాడింది. ఒక సినిమాలో సరకు లేకుంటే ఆ సినిమాను ఎంతగా ప్రమోట్ చేసినా చూడరని కాజల్ అభిప్రాయపడింది. 
 
సినిమాలో సరకుంటేనే ఆ సినిమాను అభిమానులు, ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్ చూసే సినిమాలేంటో.. వారు ఎలా సినిమా తీస్తే చూస్తారనే విషయం లో నటులు జాగ్రత్త పడాలని.. మంచి సినిమాల గురించి ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంది.