బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (10:28 IST)

కడుపు నిండా మొహమాటం లేకుండా తినేస్తా.. కానీ?: కాజల్

డైట్ కోసం లైట్ తినడం తనకు అస్సలు నచ్చదని కాజల్ అగర్వాల్ అంటోంది. ఫిగర్ని కాపాడుకునే ప్రయత్నంలో నచ్చిన పదార్థాలను తీసుకోకుండా ఉండటమంటే అస్సలు నచ్చదని కాజల్ వెల్లడించింది. నోరు కట్టడం అన్నది తన విషయంలో చస్తే కుదరదని ఈ చిన్నది చెబుతోంది.
 
"మనకిష్టమైనవి తినకూడదు అంటే నేనసలు ఒప్పుకోను. నాకు నచ్చినవి కడుపు నిండా మొహమాటం లేకుండా లాగించేస్తాను. అయితే, రోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తాను. ఎట్టి పరిస్థితులలోనూ అది మిస్ కాను. 
 
అలాగే, రోజూ ఎనిమిది గంటలు పడుకుంటాను. ఒకవేళ ఇంట్లో కుదరకపోయినా, షూటింగ్ షాట్ గ్యాప్స్‌లో నా కారవాన్‌లోకి వెళ్లి చిన్న చిన్న కునుకులు తీసేస్తాను. అందుకే, నేనింతవరకూ ఒక్క కిలో కూడా బరువు పెరగలేదు" అని చెప్పింది కాజల్.