శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (13:27 IST)

క్లాసిక్ ''దేవదాస్'' రీమేక్‌లో కాజల్ అగర్వాల్!

కాజల్ అగర్వాల్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. అదీ టాలీవుడ్ కాదు. కోలీవుడ్ కాదు.. బాలీవుడ్ ఆఫర్. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ సంగతేంటని అడుగుతున్నారా..? చదవండి. క్లాసిక్ 'దేవదాస్' రీమేక్‌లో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మని వరించింది.
 
శరత్ నవల 'దేవదాస్'ని బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా నేటి కాలానికి అనుగుణంగా వెండితెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో చంద్రముఖి పాత్రకు మన కాజల్‌ను ఎంచుకున్నట్టు సమాచారం.
 
దేవదాస్‌గా రాహుల్ భట్ నటించే ఈ సినిమాలో పార్వతిగా రిచా చద్దా నటిస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్‌లో సైగల్, దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి వారితో ఈ 'దేవదాస్' కథను సినిమాలుగా రూపొందించగా, అవన్నీ కూడా బాక్సాఫీస్ హిట్టయ్యాయి!