శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (16:02 IST)

సినిమా రంగానికొచ్చి పదేళ్లయినా కాజల్ అస్సలు బోర్ కొట్టదట!

సినిమా రంగానికి వచ్చి పదేళ్లయినా చందమామ హీరోయిన్‌కు అస్సలు బోర్ కొట్టదట. 'మరే వృత్తిలోనూ లేని కొత్తదనం సినిమా రంగంలో వున్న వారికి నిత్యం కనిపిస్తూ వుంటుంది' అంటోంది కాజల్. గత పదేళ్లుగా తాను ఈ నటనా రంగంలో ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా బోర్ ఫీలవ్వలేదని చెప్పింది. 'అదంతా ఫిలిం ఇండస్ట్రీ మహిమ' అని చెబుతోంది.
 
"ఇతర ఉద్యోగాలు కొన్నాళ్లకే బోర్ కొట్టేస్తాయి. అదే ఆఫీసు ... అదే పని ... అవే మనుషులు! కానీ, మా సినిమా వృత్తి అలాంటిది కాదు. ఇక్కడ ప్రతి సినిమా కొత్తగా వుంటుంది. ప్రతి సినిమాకీ కొత్త వ్యక్తులు చేరతారు. ఈ రోజు ఇక్కడుంటే రేపు మరో చోట వుంటాం. రకరకాల పాత్రలు పోషిస్తాం. అందుకే, బోర్ కొట్టని వృత్తి ఇదొకటేనని చెప్పచ్చు" అంటోంది కాజల్ అగర్వాల్.