శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (13:45 IST)

'టెంపర్' హిట్.. అయినా ఆఫర్లు లేవు.. చెన్నైకి కాజల్ మకాం..!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రతారగా వెలుగుతున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. అమ్మడు ఇటీవల ఎన్టీఆర్ సరసన నటించిన 'టెంపర్' పెద్ద హిట్టే సాధించింది. అయినా కూడా అమ్మడుకి టాలీవుడ్‌లో కొత్తగా ఏమీ ఆఫర్లు అందలేదు. 
 
తెలుగు బిగ్ హీరోలు సైతం కొత్త బ్యూటీకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో కాజల్ లాంటి పాత బ్యూటీలకు గిరాకీ తగ్గిపోయింది. అందుకే, అమ్మడిప్పుడు తమిళంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో విశాల్ సరసన ఓ చిత్రాన్ని చేసేందుకు ఒప్పుకుంది. 
 
సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ కోసం కాజల్ మకాంను చెన్నైకి మార్చిందట. ఇక కొన్నాళ్ల పాటు అమ్మడు అక్కడే వుంటుందని సినీ వర్గాల టాక్.