గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (14:30 IST)

మాజీ భార్యతో కరచాలనం చేసిన ఆ హీరో ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ!

'షమితాబ్' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పద్మశ్రీ కమల్ హాసన్ తన మాజీ భార్యకు కరచాలనం చేసి, చిరునవ్వుతో పలుకరించారు. ఆ సమయంలో కెమెరాలన్నీ ఒక్కసారి క్లిక్‌మనడంతో ఆ ప్రాంతమంతా తళతళ మెరిసిపోయింది. ముంబైలో జరిగిన 'షమితాబ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 
 
దీంతో కమల్ హాసన్‌తో పాటు ఆయన మాజీ భార్య, ఒకనాటి నటి సారిక చాలా రోజుల తర్వాత ఎదురుపడ్డారు. వెంటనే చిరునవ్వుతో సారికకు షేక్ హ్యాండ్ ఇచ్చి, చిరునవ్వుతో పలకరించాడు. అటు సారిక కూడా నవ్వుతూ పలకరించింది. ఈ సమయంలో నటి, వారి పెద్ద కుమార్తె శృతి హసన్ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.