గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (12:33 IST)

చెంప ఛెళ్లు సెంటిమెంట్...! వైభవ్‌ గోబ గుయ్..!

తమిళ యువ నటుడు వైభవ్ చెంప ఛెళ్లుమనిపించింది సోనం బజ్వా. ఎందుకో తెలుసా..? మీరు మరేదో ఊహించుకోకండి.. వైభవ్ హీరోగా నటిస్తున్న కప్పల్ చిత్రంలో సన్నివేశం కోసమే సోనం అలా వైభవం చెంప మీద కొట్టిందట.
 
వైభవ్ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు. అయినప్పటికీ ఆయన్ని తెలుగు కంటే తమిళ పరిశ్రమే ఎక్కువ ఆదరించింది. సరోజ చిత్రంతో కోలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన ఇతను ఆ తరువాత మంగాత్త తదితర చిత్రాల్లో నటించారు. 
 
కాగా ఆ మధ్య విడుదలైన ద్విభాష చిత్రం అనామిక నయనతారతో కలసి నటించారు. తాజాగా వైభవ్ హీరోగా నటించిన కప్పల్ చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. కప్పల్ చిత్రంలో సోనం బాజ్వా హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ విషయమై వైభవ్ మాట్లాడుతూ.. కప్పల్ చిత్రంలో ఒక సన్నివేశంలో హీరోయిన్ సోనం బాజ్వా తన చెంప మీద కొట్టాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాన్ని పలు టేక్‌లు తీసుకవోడంతో సోనం బాజ్వా తన చెంప చెళ్లుమనిపించిందని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే మంగాత్త చిత్రంలోనూ ఇలాంటి సంఘటనే జరిగిందని ఆ చిత్రం విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ఈ కప్పల్‌కు పనిచేస్తుందని వైభవ్ భావిస్తున్నానన్నారు. భలే ఉంది కదూ చెంప ఛెళ్లుమనిపించుకునే సెంటిమెంటు...! కాగా ఈ చిత్రంపై వైభవ్ ఎక్కువ ఆశలే పెట్టుకుని ఉన్నారు. ఆయన ఆశయం ఫలించాలని కోరుకుందాం.