గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:20 IST)

కరాటే కళ్యాణిని పట్టించిందెవరు?.. పేకాట ఆడుతుండగా అరెస్టు!

సినీ నటి కరాటే కళ్యాణిని హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురంలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు ఆమెతో పాటు.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు.. వారి నుంచి రూ. 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు చేశారు. ఈ దాడిలో పదకొండు మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట రాయుళ్లలో సినీ ఆర్టిస్టు కళ్యాణి కూడా పట్టుబడింది. 
 
ఆదివారం రాత్రి పేకాట స్థావరం నడుపుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాటరాయుళ్లు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. కరాటే కళ్యాణిగా పాపులర్ అయిన కళ్యాణి ఈ పేకాట బ్యాచ్‌లో దొరకడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది.