గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:28 IST)

కార్తికేయ స్టోరీ లైన్... నిఖిల్, స్వాతిల పెయిర్...

కార్తికేయ కథగా చెపితే... కార్తీక్‌ (నిఖిల్‌) మెడికో స్టూడెంట్‌. చదువుతోపాటు అల్లరిచిల్లరి పనులు చేస్తూ కాలేజీ డీన్‌ దృష్టిలో కొరకరానికొయ్యగా మారతాడు. వేరే కాలేజీలో చదివే వల్లీ (స్వాతి)ని మొదటిచూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె అతని ప్రేమని తిరస్కరిస్తుంది. మరోవైపు అనుకోకుండా సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో వున్న కుమారస్వామి ఆలయంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. మూసివేయబడిన ఆ గుడి విరాలను తెలుసుకోవాలని దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగి శంకర్‌, రచయితగా మారి.. దాని గురించి పరిశోధించి చనిపోతాడు. ఆ కేసును డీల్‌ చేసే ఇన్‌స్పెక్టర్‌ కూడా అనుకోకుండా పాము కాటుకు గురవుతారు. అలాంటి ప్రాంతంలో కార్తీక్‌ స్నేహితులతో సహా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌కు పంపిస్తాడు. దానితోనైన కార్తీక్‌ పొగరు అనుగుతుందని ప్రిన్సిపాల్ భావిస్తాడు. 
 
విషయం తెలిసి.. కార్తీక్‌ తల్లి తులసి.. స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని జాగ్రత్తగా వుంచుకోమని చెబుతుంది. ఆ తర్వాత వారంతా సుబ్రహ్మణ్యపురం ఊరి వెళ్ళడం. అక్కడ ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌ చేయడంతోపాటు గుడిలోని రహస్యాల్ని చేధించాలనే కోరిక కార్తీక్‌లో బలంగా వుంటుంది. అనుకోకుండా అక్కడే క్యాంపుకు వచ్చిన వల్లీని ఆమె తండ్రి తనికెళ్ల భరణి సహాయంతో పెండ్లి చేసుకుంటానని చెప్పేస్తాడు. ఈ క్రమంలో ఓ సంఘటనలో కార్తీక్‌కు పగపట్టే పాము కన్పిస్తుంది. తనపైనే ఎందుకు పగ పట్టింది? అంటూ ఓ పూజారి సాయంతో పక్క ఊరిలోని స్వామీజి వద్దకు వెళతాడు. ఆ తర్వాత ఏమయింది? అక్కడ ఆ స్వామీజీ ఏం చెప్పాడనేది కథ.