శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 31 జులై 2014 (17:22 IST)

మధుర శ్రీధర్‌కు బెల్లంకొండ షాక్.. ఆదుకున్న సీఎం కెసిఆర్‌!

సినిమావాళ్లను నమ్మకూడదని అంటుంటారు. కొత్తగా ఈ రంగం లోకి వచ్చిన వారికి చాలామంది ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు. కానీ, కొందరికి సినిమా తీయడం వరకు సాఫీగా జరిగిపోతుంది. దాని తన్వాత... వారు మీడియా ముందుకు వచ్చి సినిమా తీయడం ఇంత ఈజీనా! అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. అంతా సాఫీగా జరిగిపోయినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత సీన్‌ కనబడుతుంది. రిలీజ్‌ ముందు.. థియేటర్లు, ల్యాబ్‌ చెల్లింపులు, సెన్సార్‌ సమస్యలుంటాయి. 
 
కాగా, స్నేహగీతం, బ్యాడ్‌బాయ్స్‌, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మధుర శ్రీధర్‌కు ప్రముఖ నిర్మాత నరకం చూపించాడట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. మధుర శ్రీధర్‌ నిర్మాతగా మారి 'మాయ' చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడుగా బాగా పేరున్న నీలకంఠ కాంబినేషన్‌ ఓకే. మరి ఏమిటి ప్రాబ్లమ్‌ అంటే.. గత వారంనాడే 'మాయ' సెన్సార్‌కు వెళ్ళింది. 
 
ఆర్డర్‌ ప్రకారం లైన్‌ వుండి అప్పుడే సెన్సార్‌ చేయాల్సి వుండగా... బెల్లంకొండ సురేష్‌ తన కుమారుడు సినిమా 'అల్లుడు శీను'కు ఆర్డర్‌ ఇస్తే... మీ రుణం తీర్చుకుంటానంటూ.. కాళ్ళావేళ్ళా పడ్డాడట. భవిష్యత్‌లో మాయ చిత్రానికి ఏదో రకంగా హెల్ప్‌ చేస్తాడని భావించి.. మాయ ఆర్డర్‌ను అల్లుడు శ్రీనుకు మార్చేశాడట. ఇక ఆ తర్వాత మధుర శ్రీధర్‌కు సినిమా కన్పించిందట. 
 
సెన్సార్‌ రూల్‌ ప్రకారం.. మాయ సెన్సార్‌ కావాలంటే.. నెలరోజులు పైగా పడుతుంది. దాంతో జరిగిన అన్యాయం తెలుసుకుని బెల్లంకొండను అడిగితే... నో రెస్పాన్స్‌... చేసేది లేక... డైరెక్ట్‌గా కెసిఆర్‌ దగ్గరకెళ్ళి తన గోడు విన్పించుకున్నాడట. దాంతో సెన్సార్‌ క్లియర్‌ అయింది. తాను చేసిన తప్పు తెలుసుకుని.. వారం రోజులపాటు బాగా మథపడ్డాననీ, ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నానని.. బాధతో మధుర శ్రీధర్‌ చెబుతున్నాడు.