బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:56 IST)

కెసిఆర్‌ తాయిలాలకు సినీ ఇండస్ట్రీ ధన్యవాదాలు...

ఇప్పుడు తెలుగు సినిమా రంగం మంచి రసపట్టులో వుంది. తెలంగాణలో సినిమావారి గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడని కెసిఆర్‌... స్వయంగా బుధవారం రాత్రి ఓ ప్రటకన చేశారు. 2 వేల ఎకరాల్లో సినీ ఇండస్ట్రీ కోసం భూములు కేటాయిస్తామనీ, సినీ సిటీని తయారు చేస్తాననీ, ఇక్కడివారికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. 
 
అది పెద్ద న్యూసయి... ఎప్పుడు తెల్లారుతుందా! అంటూ సిని ఫెడరేషన్‌ సభ్యులంతా ఒక్కటయి... హడావుడిగా మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కెసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్‌ అనుకుంటే సినిమా వారికి ఏదైనా ఇస్తారనీ, ఆయన సినిమాపై చూపిస్తున్న ప్రేమకు ఫెడరేషన్‌ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
 
ఇందులో పరుచూరిగోపాలకృష్ణ, కొమరం వెంకటేష్‌, ఇంకా మిగిలిన శాఖలకు చెందిన వారంతా వున్నారు. కాగా, ఇటీవలే.. వైజాగ్‌లో సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న ఎంపీ హరిబాబు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా.. ఇద్దరూ సంయుక్తంగా సినిమా పరిశ్రమ వైజాగ్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు, అందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే కెసీఆర్‌ నుంచి మరో ప్రకటన రావడం... చాలా ఆశ్చర్యంగా వుందని ఫెడరేషన్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల రాయితీలను సినిమా పరిశ్రమ హాయిగా అనుభవించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.