శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (10:26 IST)

బీజేపీలో చేరే ప్రసక్తే లేదు : సినీ నటి ఖుష్బు

తాను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను సినీ నటి ఖుష్బు కొట్టిపారేశారు. ప్రస్తుతం తన సినీ గ్లామర్, వాక్చాతుర్యంతో అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ... తమిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. తొలుత ఎంకేలో చేరి, అనతి కాలంలోనే ఎదిగిన ఖుష్బు... అంతే వేగంతో పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరుతుందన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే, ఈ ప్రచారానికి ఖుష్బు ముగింపు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీలో చేరనని, తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని ట్వీట్ చేశారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూతలు రంగంలోకి దిగి తమిళనాడులోని అనేక మంది సినీ నటులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.