శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (19:47 IST)

రవితేజ-ఇలియానా 'కిక్' కొడుకు కథే 'కిక్-2' (ఫోటోలు)

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'కిక్‌' ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న 'కిక్‌-2' ఆగస్ట్‌ 20 ఉదయం గం. 8.43 ని||లకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. నటరత్న ఎన్‌.టి.రామారావు చిత్రంపై తీసిన ఫస్ట్‌ షాట్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్లాప్‌నివ్వగా, మాస్‌ మహారాజా రవితేజ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. ఇంకా ఈ ప్రారంభోత్సవంలో నందమూరి రామకృష్ణ, ఠాగూర్‌ మధు, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, భోగవల్లి ప్రసాద్‌, భోగవల్లి బాపినీడు, మహేంద్రబాబు తదితరుల పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాస్‌ మహారాజా రవితేజ మాట్లాడుతూ - '''కిక్‌' తర్వాత మళ్ళీ సురేందర్‌రెడ్డితో మరో ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఇది మంచి కిక్‌ ఇచ్చే సినిమా అవుతుంది'' అన్నారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఈ సినిమా 'కిక్‌'కి సీక్వెల్‌ కాదుగానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇచ్చే సినిమా అవుతుంది. 'కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్ళిద్దరి కొడుకు కథే 'కిక్‌ -2''' అన్నారు.
 
నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''అతనొక్కడే' వంటి సూపర్‌హిట్‌ తర్వాత మా సురేందర్‌రెడ్డితో రవితేజ హీరోగా చేస్తున్న సినిమా ఇది. ఈరోజు నుంచే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. మార్చి 28న సమ్మర్‌ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తాము'' అన్నారు. 
 
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.