బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (12:16 IST)

లింగాకు భారీ ఆఫర్స్: ప్రదర్శన హక్కులు రూ.6.30 కోట్లు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ద్విపాత్రాభినయంతో వస్తున్న 'లింగా' చిత్రానికి తెలుగు నాట కూడా మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. రజనీకాంత్‌కి వున్న ఇమేజ్‌ను బట్టి, ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న క్రేజ్‌ను బట్టి ఇది మంచి బిజినెస్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
 
తాజాగా సీడెడ్ ఏరియాకు ఈ సినిమా ప్రదర్శన హక్కులు రూ.6.30 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ రేటుకి ఈ రైట్స్‌ను తీసుకున్నాడట. 
 
డిసెంబర్ 12న రజనీ జన్మదినం రోజున రిలీజవుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి కథానాయికలుగా నటించారు. కె.యస్. రవికుమార్ దీనికి దర్శకత్వం వహించారు.