శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (14:35 IST)

చరణ్ చిత్రంలో కృతి కర్బంద... హీరోయిన్‌గా కాదు.. మరి...!

మెగా హీరో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రంలో అందాల తార కృతి కర్బంద నటించనుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో చరణ్ చెంతకు చేరనున్న ఆ హీరోయిన్లు ఎవరా అనే వార్త చర్చనీయాంశమైంది.
 
ఈ స్థితిలో ఆయన సరసన హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ రెండో హీరోయిన్‌ ఎవరనే విషయంపై సస్పెన్స్ చోటు చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ చిత్రంలో నటించే మరో నటి కృతి కర్బంద అని తెలిసింది. అందులో అమ్మడు హీరో‌యిన్ పాత్రలో నటించడం లేదట. చరణ్ సిస్టర్‌గా నటిస్తున్నట్టు సమాచారం.
 
ఈ సినిమాలో చరణ్ సిస్టర్ పాత్రకు ప్రాముఖ్య ఉంటుందని, అందువలనే ఆమె సిస్టర్‌గా నటించేందుకు అంగీకరించినట్టు తెలిపిందని సమాచారం. మార్చి 5న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభిస్తారు. తర్వాత రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సినీ వర్గాల సమాచారం.