శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (14:10 IST)

కృతిసనన్ స్మోకింగ్.. దోచేయ్‌ని దెబ్బతీసిందా?

సినిమాల్లో ప్రస్తుత హీరోయిన్లు హీరోలతో పోటీపడుతున్నారు. గ్లామర్ డాల్స్‌గా స్కిన్ షో, ఐటమ్ సాంగ్స్ చేసేయడమే కాకుండా హీరోకు ధీటుగా క్యారెక్టరైజేషన్ రోల్స్ పోషించడంలో పోటీపడుతున్నారు. కమర్షియల్ విలువల కోసం సినిమా హిట్ కావడం కోసం డైరక్టర్లు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇదే తరహాలో సుధీర్ వర్మ.. కృతిసనన్‌ను స్మోకింగ్‌కు అడిక్ట్ అయిన అమ్మాయిగా దోచేయ్‌ సినిమాలో చూపించాడు. 
 
స్వామి రారా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ వర్మ మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినేలా కృతి సనన్‌ను క్యారెక్టర్‌ను మలిచాడు. దీంతోనే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని టాక్ వస్తోంది. దోచేయ్ కమర్షియల్‌గా హిట్టైనా.. కృతి సనన్ ఈ సినిమాల్లో మగరాయుడిలా కనిపించడం.. స్మోకింగ్ చేస్తుండటం వంటి సీన్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యేందుకు కారణమైందని, కృతి సనన్‌ది బోల్డ్ క్యారెక్టర్ అయినప్పటికీ.. అది కామెడీకి పరిమితమవడం సినిమాను దెబ్బతీసిందని సినీ పండితులు అంటున్నారు.