శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (16:16 IST)

మంచు లక్ష్మి ఐస్ బకెట్ ఛాలెంజ్.. తాప్సీకి.. (వీడియో)

టాలీవుడ్ యాక్ట్రస్ మంచు లక్ష్మి కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐస్ బకెట్ ఛాలెంజ్‌కు క్రేజ్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మాజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ సహా హాలివుడ్ నటులు, బాలీవుడ్ నటులూ, పలువురు సెలబ్రిటీలు, సాధారణ ప్రజలూ ‘ఏఎల్ ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్' లో పాల్గొంటున్నారు.
 
ఓ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టుకు విరాళం ఇవ్వడంలో భాగంగా ఈ ఐస్ బకెట్ చాలెంజ్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ లిస్టులో తెలుగు నటి మంచు లక్ష్మి కూడా చేరిపోయారు. 
 
ఒక మంచి పని కోసం జరుగుతున్న కార్యక్రమం కావడంతో తానూ ఈ ఐస్ బకెట్ చాలెంజ్‌లో పాల్గొన్నట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. తన స్నేహితులైన ప్రదీప్, స్వప్న చిలుకురి తనకు ఐస్ బకెట్ చాలెంజ్ చేయడంతో స్వీకరించిన మంచు లక్ష్మి తన స్నేహితులైన తాప్సీ, యువరాజ్ సింగ్, జీవి కేశవ్‌లకు ఐస్ బకెట్ చాలెంజ్ చేశారు.