శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (19:47 IST)

డిసెంబర్ రిలీజ్ : 'లక్ష్మీరావే మా ఇంటికి'

నాగశౌర్య, అవికా గోర్‌ జంటగా నంద్యాల రవి దర్శకత్వంలో గిరిధర్‌ నిర్మిస్తున్న చిత్రం 'లక్ష్మీరావే మా ఇంటికి'. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రేమకథా చిత్రాల్లో కొత్తగా వుండే కథనమిది. డిసెంబర్‌ 5న విడుదల చేయనున్నామని' చెప్పారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ....ఇందులో ప్రతిపాత్రా ప్రవర్తించే తీరు ప్రశంసార్హకంగా వుంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ మనకు తెలిసిన వాళింట్లో జరుగుతున్న సంఘటనల సమాహారంగా అప్యాయతా, ఆత్మీయతల మేళవింపుగా వుంటుంది' అని తెలిపారు.
 
నాగశౌర్య మాట్లాడుతూ... నా పాత్ర పేరు సాయి. చాలా ఫన్నీగా వుంటూనే రఫ్‌గా ఉంటుంది. నాకు సంతృప్తినిచ్చిన పాత్ర అని చెప్పారు.