గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (12:19 IST)

''ముని 3'': తాప్సీ, లారెన్స్ సినిమా డిసెంబర్‌కి రిలీజ్!

సొట్టబుగ్గల సుందరి తాప్సీ తెలుగులో నటిస్తున్న ఒకే ఒక సినిమా 'ముని 3'. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం నుంచి జరుగుతోంది. మధ్యలో దర్శకుడు లారెన్స్ ప్రమాదానికి గురై, మంచాన పడడంతో కొంత కాలం ఆగిపోయింది. 
 
ఇప్పుడు షూటింగును పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో వుంది. కాగా, ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేయడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన 'ముని' హారర్ చిత్రాలకు ఇది మూడో సీక్వెల్ కావడం గమనార్హం.