గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:47 IST)

బాలయ్య పరిపూర్ణ నటుడు : బోయపాటి శ్రీను కితాబు

బాలకృష్ణతో 'సింహా' చిత్రం తర్వాత మళ్ళీ మరో చిత్రం చేయడం సాహసంతో కూడింది. అలాంటి ప్రయత్నాన్ని 'లెజెండ్‌'తో చేసి విజయం సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను. 'లెజెండ్‌' చిత్రం యాభైరోజులు ఎక్కువథియేటర్లలో ఆడగా, 100 రోజులు 31 సెంటర్లలో ప్రదర్శించబడింది. ఇప్పుడు 175 రోజులు రెండు సెంటర్లలో ఆడటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర విజయం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
ప్రతి సినిమాను విజయం చేయడానికి ప్రయత్నిస్తాం. 'సింహా' చేశాక అంతకంటే మంచి చిత్రం తీయాలని ప్రయత్నించాను. ప్రేక్షకుల ఆశీస్సులతో 175 రోజులు ఆడటం ఆనందంగా వుంది. ఒకే హీరోతో రెండు చిత్రాలు చేయడం సాహసమే. దర్శకుడుగా నన్ను నేను నమ్మినట్లే.. నాపై బాలకృష్ణగారు పెట్టిన నమ్మకంతో ఈ చిత్రాన్ని చేయగలిగాం. అందుకు సరైన కథ కూడా కుదిరింది. మూడేళ్ళనాడు కథను అనుకుని ఎలక్షన్ల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ చిత్రం విజయానికి కథ,కథనం, మాస్‌, ఫ్యామిలీ, యూత్‌ అంశాలన్నీ కూర్చి వారు మెచ్చేలా తీర్చిదిద్దాం. మంచి అనేది చెప్పాల్సిన వ్యక్తిద్వారా చెప్పిస్తే అందాల్సినవారికి అందుతుందని లెజెండ్‌ చిత్రం నిరూపించింది అన్నారు.
 
100వ చిత్రానికి కథ రెడీ కాలేదు
 
బాలకృష్ణకు వందవ సినిమా చిత్రానికి కథ ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు రాజకీయనాయకుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందుకు తగినవిధంగా కథ వస్తే ఎప్పుడైనా అమలు కావచ్చు. అదేవిధంగా చిరంజీవికి కథ ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. ఆయనకు కథ ఇవ్వలేదు. ఆయన ఫంక్షన్లలో.. పూర్తి ఎంటర్‌టైనర్‌ కావాలని చెబుతున్నారని తెలిపారు.  
 
కొత్తచిత్రం గురించి చెబుతూ... 'అల్లుడు శీను' చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో తదుపరి చిత్రం చేస్తున్నాను. కథాపరంగా హీరో ఆహార్యం, కేశాలు కొత్తగా కన్పించాలి అవన్నీ అయ్యాక చిత్రం సెట్‌పైకి వస్తుందని తెలిపారు. ఈ చిత్రంలోనూ విలన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని అన్నారు.