గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (09:52 IST)

బాక్సాఫీసు వద్ద నిరాశపరిచిన 'లింగ' : రజనీకాంత్‌కు పోలీసు భద్రత!!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం లింగ. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై... బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశపరిచింది. 
 
ముఖ్యంగా.. తమిళనాడులో కూడా అనుకున్న స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టలేక పోయింది. తిరునల్వేలి, కన్యాకుమారి ఏరియాలకు కోట్లాది రూపాయలు పెట్టి లింగా హక్కులను కొనుగోలు చేయగా... ఇప్పటి వరకు రూ.1.50 కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, 'లింగ' నష్టపరిహారం కోసం హీరో రజనీని థియేటర్ల యాజమాన్యం సోమవారం కలవనుంది. ఈ సందర్భంగా తమకు భద్రత కల్పించాలంటూ వారు చెన్నై పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణమండపంలో వీరు రజనీతో భేటీ కానున్నారు. గతంలో పలుమార్లు థియేటర్ యజమానులను రజనీకాంత్ ఆదుకున్న విషయం తెల్సిందే.