శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 25 సెప్టెంబరు 2014 (20:30 IST)

'లౌక్యం' గోపీచంద్ కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది

గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై శ్రీవాస్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్‌ చిత్రం 'లౌక్యం'. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది. అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుని ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను జరుపుకుంది. గోపీచంద్‌ మాట్లాడుతూ... లక్ష్యం, శౌర్యం రెండూ యాక్షన్‌ చిత్రాలే. మూడో సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తీయాలనుకున్నాం. శ్రీధర్‌ అందుకు తగిన కథ సమకూర్చారు. దానికి కోనవెంకట్‌, గోపీమోహన్‌ నెలరోజులపాటు స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఈ సినిమా నా కెరీర్‌లో మంచి చిత్రంగా నిలుస్తుందనుకుంటున్నాను అని చెప్పారు.
 
ఈ సందర్భంగా రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ... అనూప్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే.. నా ఫేవరేట్‌ ఆల్బమ్స్‌. వాటిని బీట్‌ చేసే ఆడియో ఈ చిత్రాన్ని ఇచ్చాడు అనూప్‌. నేను ఈబేనర్‌కి, గోపీచంద్‌కు మొట్టమొదటిసారి పనిచేశాను. శ్రీధర్‌ ఇచ్చిన కథ మంచి స్క్రీన్‌ప్లే రాసేలా మమ్మల్ని పురిగొల్పింది. గోపీచంద్‌ ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. పూర్తిస్థాయిలో వినోదం కల్గించే ఈ చిత్రంతో బ్రహ్మానందంగారు సిప్పీ అనే వెరైటీ పాత్ర పోషించారు. ఈ చిత్రంపై నమ్మకంతో గుంటూరు ఏరియా కొనుక్కున్నాను. పవన్‌కళ్యాణ్‌కు అత్తారింటికి దారేదిలా గోపీచంద్‌కు లౌక్యం పేరు తెస్తుంది అన్నారు.
 
రూబెన్స్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్లాటినం జరుపుకోవడం చాలా సంతోషంగా వుంది. ఇందులో అన్ని పాటలు సందర్భానుసారంగా వుంటాయి. వీటికి మంచి సాహిత్యాన్ని రచయితలు అందించారని తెలిపారు. అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ... ఈ సినిమాలో 'నిన్ను చూడగానే నాకేదో అయింది..' అనే మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు.
 
చిత్ర దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ.. లక్ష్యం తర్వాత గోపీచంద్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా అంచనాలు వుంటాయి. గోపీతో ఓ మంచి ఫ్యామిలీ సినిమా చేయాలని నిర్మాత అనుకున్నారు. చాలా కథలు విన్నారు. శ్రీధర్‌ సీపాన చెప్పిన కథను ఓకే చేశారు. అయితే ఈ కథను పెద్ద రేంజ్‌కు తీసుకెళ్ళాలన్న ూద్దేశ్యంతో కోన వెంకట్‌ స్క్రీన్‌ప్లే చేయించడం జరిగింది. ఏప్రిల్‌లో మొదలయి ఈనెలలో విడుదల కావడానికి నిర్మాతే కారణం. అన్ని సదుపాయాలు సమకూర్చారు. అనూప్‌ రీరికార్డింగ్‌ హైలైట్‌గా నిలుస్లుంది' అన్నారు.