శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
Written By Ganesh
Last Updated : శనివారం, 31 మే 2014 (11:56 IST)

మహేష్ బాబు ''ఆగడు'' ఫస్ట్‌లుక్ ట్రైలర్ రిలీజ్... తెగ ఊపేస్తోంది!

సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' ఫస్ట్‌లుక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఊపేస్తోంది. యూట్యూబ్‌లో దీనికి విశేషస్పందన వస్తోంది. పోలీష్ పాత్రలో మహేష్ కనిపిస్తున్నాడు. ఇందులో మహేష్ చెబుతోన్న డైలాగ్స్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ట్రైలర్ 'ఆగడు' సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసింది. దూకుడు వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌కి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా నదియా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.