శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (17:30 IST)

ఉగాదికి మహేష్‌ బాబు లుక్.. సెంటిమెంట్ అంట‌!

పండుగ నాడు మహేష్‌కు సెంటిమెంట్‌గా భావించి మార్చి 21న ఉగాది నాడు కొరటాల శివ, మహేష్ బాబు సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ యాక్షన్‌లో వుంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇటీవలే కుంబకోణంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
ఇక తన మొదటి సినిమా 'మిర్చి'తోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన కొరటాల, మహేష్‌కు కూడా భారీ విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలాఖరున 15 రోజుల షెడ్యూల్‌ కోసం ఫ్రాన్స్‌ వెళ్లనున్నటు తెలుస్తోంది. ఇక శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.