మహేష్‌బాబు కొత్త సినిమా టైటిల్ 'మగాడు' కాదు...
మహేష్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న చిత్రం పేరు 'మగాడు' అని పెట్టనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు వెల్లడించారు. వారు మాట్లాడుతూ... ''మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్ ప్రచారం అవుతున్నాయి కానీ అవి కాద"ని తెలిపారు.