గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:49 IST)

అజ్మీర్ దర్గాకు 'ఆగడు' మహేష్... మహేష్‌తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని...

అజ్మీర్ దర్గాను తన సినిమాలు విడుదలయ్యే ముందు దర్శించుకోవడం హీరో మహేష్ బాబుకు సెంటిమెంటుగా మారిందా అంటే అవుననే అంటున్నారు. గతంలో కూడా 'దూకుడు' సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దర్గాకు వెళ్లి వచ్చాడు. ఇంకా అదే సంప్రదాయాన్ని 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలకు ముందు కూడా సాగించాడు. అజ్మీర్ దర్గాకు వెళ్లేటపుడు చిత్ర యూనిట్ కూడా ఆయన వెంట వస్తోంది.
 
ఇకపోతే "మహేష్‌తో ఎప్పుడు సినిమా చేసినా కొత్తగా వుంటుంది. 'దూకుడు', '1' నేనొక్కడినే తర్వాత ఆయనతో చేస్తున్న సినిమా 'ఆగడు'. ఇందులోని పోలీసు పాత్రకు, గబ్బర్‌సింగ్‌లోని పవన్‌ పాత్రకూ పోలికేదు. అయితే మహేస్‌లో మళ్ళీ మళ్ళీ చిత్రాలు చేయాలనుంది. అలా అనిపించడం అదృష్టం అని.. చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర తెలియజేశారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో చిత్ర నిర్మాతలు చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియజేశారు. 
 
వారి మాటల్లో.... 'ఆగడు' చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఎవ్వరూ ఆపలేని పోలీస్‌ ఆఫీసర్‌గా మహేష్‌ నటించారు. సి.ఐ.గా ఆయన పాత్ర వుంటుంది. డైలాగ్స్‌ కూడా అందరికీ నచ్చుతాయి. మూడు చిత్రాల్లోనూ మహేష్‌ తన పెర్‌ఫార్మెన్స్‌ను కొత్తగా చూపించారు. ఇప్పటికే సెన్సార్‌ పూర్తయి యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. దాదాపు 2 వేల థియేటర్లలో అన్నిచోట్ల విడుదల చేస్తున్నాం. ఓవర్‌సీస్‌లోనూ 159 థియేటర్లలో విడుదలవుతుంది' అని చెప్పారు.
 
శ్రీనువైట్ల  దర్శకత్వం గురించి వివరిస్తూ... ప్రతి చిత్రాన్ని కొత్తగా వుండేలా చర్యలు తీసుకుంటారు. ఇందులో మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో రియాల్టీ షో కూడా వుంది. గతంలో శ్రీనువైట్ల చిత్రంలో వున్న తరహాలోనే ఎంటర్‌టైన్‌గా వుంటుంది. ఎవ్వరినీ విమర్శించేట్లుగా వుండదు అన్నారు. శ్రుతిహాసన్‌ ఇందులో ప్రత్యేక పాటలో కన్పిస్తుంది. కథలోని పాత్రమేరకు దర్శకుని సూచన మేరకు ఆమెను సంప్రదించడం, మహేష్‌ అంగీకరిస్తే చేస్తాననడం జరిగిందని అన్నారు. థమన్‌కు సంగీతపరంగా యాభైవ సినిమా. అందుకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందులోని పాటలను బళ్ళారి, స్విట్లర్లాండ్‌, ముంబై, లడక్‌లలో చిత్రించామనీ, శ్రుతిహాసన్‌పై పాటను ఫిలింసిటీలో చిత్రించామని తెలిపారు.
 
షూటింగ్‌లో భాగంగా కొన్ని సాహసమైన లొకేషన్లలో చేశామని చెబుతూ... బళ్ళారిలోని జింథాల్‌ ఫ్యాక్టరీలో 22రోజులుపాటు షూటింగ్‌ చేయడం కష్టమైనా ఇష్టంగా చేశామన్నారు. అక్కడ దుమ్ము ఎక్కువగా వున్నా, మహేష్‌బాబుతోపాటు ఆర్టిస్టులంతా సహకరించారని చెబుతూ.. దాని తర్వాత రెండు రోజుల గ్యాప్‌తో లడక్‌లో షూటింగ్‌ చేశామన్నారు. అక్కడ ఒకేసారి చలి, వెంటనే అతివేడి వాతావరణ వుంటుందనీ, ఒక్కోసారి ఆక్సిజన్‌ కూడా దొరకదనీ తెలిపారు. దాదాపు 90 మంది డాన్సర్లు ఇందులో పాల్గొన్నారు. ఆ చిత్రీకరణకు డాక్టర్ల సహాయం ఎంతో అవసరమైందని పేర్కొన్నారు. ఇవన్నీ కథాపరంగా శ్రీనువైట్ల ఎన్నుకున్న లొకేషన్లని అన్నారు. బళ్ళారిలో షూటింగ్‌ చేయడంతో ఇదేదో మైనింగ్‌ మాఫియా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ దానికి ఏమాత్రం సంబధంలేదనీ, కథరీత్యా కొత్తగా వుండాలని ఎంపికచేశామన్నారు.  బ్రహ్మానందం సెకండాఫ్‌లో వస్తారనీ తర్వాత పూర్తి ఎంటర్‌టైనర్‌గా వుంటుందన్నారు.
 
తమిళనాడు, కేరళతోపాటు ఉత్తర భాతరతదేశంలో హిందీ సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా '1' అనే చిత్రం తమిళ, మలయాళంలోనూడా వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఎమోషనల్‌గా వుంటుందని తెలిపారు.