శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (15:44 IST)

పాట వీడియో లీక్..! 'శ్రీమంతుడు' షాక్..!

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని సమాచారం. కానీ ఇందులో మంచి యాక్షన్ పార్ట్ కూడా మిక్స్ అయ్యిందట. ఇక ఈ సినిమాలో ఓ పాట మహేష్ బాబుని మరదలు ఆటపట్టించే పాట అట. ఈ మరదలి పాత్రలో వర్థమాన నటి కారుణ్య చౌదరి నటించింది. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ జరిగింది. 
 
కాగా ఈ పాటని చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరో సెల్ ఫోన్ ద్వారా కొంచెం పాటని చిత్రీకరించి ఆ వీడియో లీక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. ఇలా వీడియో లీక్ అవడంతో చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందట. ఈ వీడియో లీకైన వెంటనే, ఇకపై ఇలాంటి లీకేజ్‌లు జరగకూడదని చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ వీడియోను లీక్ చేసింది ఎవరోగానీ, ఆ పాట బిట్ మాత్రం అదిరిపొయిందట. మహేష్ బాబు లుక్ సూపర్ అట. ఈ బిట్ చూసిన వారు సినిమా భారీ హిట్ సాధించడం ఖాయమని అంటున్నారు.