శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:59 IST)

డర్టీ పాలిటిక్స్ మల్లికా షెరావత్‌పై కేసు: హైకోర్టులో వ్యాజ్యం

డర్టీ పాలిటిక్స్ సినిమాకు సంబంధించి తలెత్తిన వివాదాలకు సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తోంది. కానీ హాట్ భామకు కష్టాలు తప్పేలా లేవు. ఈ మేరకు మల్లికా షెరావత్‌పై కేసు నమోదైంది. డర్టీ పాలిటిక్స్’ సినిమా కోసం తాను తన ఒంటిమీద కప్పుకున్నది జాతీయ పతాకం కాదని మల్లికా షెరావత్ చెబుతోంది. మూడు రంగులున్నంత మాత్రాన దానిని జాతీయ పతాకం అనడమేంటని మల్లిక అడిగింది.
 
కాగా సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కారు టాప్ పైన అర్ధనగ్నంగా కూర్చుని.. జాతీయపతాకాన్ని ఆచ్చాదనగా కప్పుకోవడం ద్వారా మల్లికా షెరావత్ మరో వివాదానికి తెరలేపింది. మల్లికా షెరావత్ హీరోయిన్‌గా నటిస్తున్న డర్టీ పాలిటిక్స్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.
 
డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మల్లికా షెరావత్ రాజస్థాన్ అసెంబ్లీకి ఎదురుగా... ఓ కారు టాప్ పైన అర్థనగ్నంగా కూర్చుని... తన శరీరం పై కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే కప్పుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో మల్లిక జాతీయపతాకాన్ని చీరలా అభ్యంతరకరంగా ధరించినట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తుందని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ధన్ పాల్ రావు పేర్కొన్నారు. 
 
జాతీయ పతాకాన్ని అవమానపరిచేలా దృశ్యాలు డర్టీ పాలిటిక్స్‌లో చిత్రీకరించారని... అందువలన ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆయన హైదరాబాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.