గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 24 సెప్టెంబరు 2014 (18:47 IST)

హిట్టయితే పేరు వేసుకోనంటున్న దర్శకుడు!

దర్శకుడు అనేవాడు.. తను మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తే.. తన పేరు వేసుకుంటాడు. కానీ ఎవరో దర్శకత్వం వహిస్తే అది పొరపాటున బంపర్‌ హిట్టయితే పేరు వేసుకోవడం అనేది ఇటీవలే జరిగిందని 'ప్రేమకథా చిత్రమ్‌' విషయంలో ఇది జరిగిందనే వార్తలు అప్పట్లో విన్పించాయి. అది జరిగి చాలా కాలమైంది. దానికి సమాధానంగా దర్శకుడు మారుతీ.. బుధవారంనాడు వివరణ ఇస్తున్నాడు. 
 
అంటే.. ఇంకా ఆ ప్రభావం ఆయనపై వుందనే కదా.... ఆయన దగ్గర పనిచేసిన శివ గణేష్‌ కొత్తగా దర్శకుడు అయ్యాడు. 'కాయ్‌ రాజా కాయ్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఈ రోజుల్లో, బస్టాప్‌ చిత్రాల్లో నటించిన హీరో ఫ్రెండ్స్‌.. హీరోలుగా మారిపోయారు. 
 
ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.... నా శిష్యుడు దర్శకుడు అయ్యాడు. ఆయన బాగా చేశాడు. అదేవిధంగా... ఎవరో రాసిన మాటలు, దర్శకత్వం వహిస్తే.. అది హిట్టయితే.. నేను వుపయోగించుకుంటున్నట్లు చాలామంది అనుకుంటున్నారు. అది అవాస్తవం అంటూ అన్నాడు. ఇలా వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో.. లేనప్పుడు కామ్‌గా వుండవచ్చు కదా.. అంటే ఏదో వుందని అర్థమన్నమాట.