బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (20:22 IST)

హార్రర్‌ సినిమాలు ఎక్కవయ్యాయ్‌....

'హారర్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటి యూత్‌ పరిమిత బడ్జెట్లో, మంచి కథతో, చక్కటి సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తో తీసే హారర్‌ సినిమాలవైపు తీయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది చాలా చిత్రాలు వచ్చాయి. అందులో భాగంగా 'మాయా చిత్రం' వస్తోంది అని గాయకుడు, సంగీత దర్శకుడు రఘుకుంచె అన్నారు.
 
వినయ్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా 'మాయాచిత్రం'. కళావతి సమర్పిస్తున్నారు. 'టేక్‌ కేర్‌ యువర్‌ హార్ట్‌ బీట్‌' అనేది ఉపశీర్షిక. వినయ్‌ రాజ్‌, రుక్షర్‌ మిర్‌, వైశాలి పటేల్‌ కీలక పాత్రధారులు. జి.వినయ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. జి.వెంకన్న నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది.
 
మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ 'మాయ' సినిమా చేసే సమయంలో ఈ పోస్టర్‌ను చూశాను. చాలా వైవిధ్యంగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. హారర్‌ హవా సాగుతున్న ఈ రోజుల్లో 'గీతాంజలి'లా ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని అభిలషించారు.
 
వినయ్‌ రాజ్‌ మాట్లాడుతూ... సినిమాపై ఆసక్తితో నాన్నగారి పర్మిషన్‌ తీసుకుని సినిమా మొదలుపెట్టాను. సీజీ వర్క్‌ కు ప్రాధాన్యత ూన్న సినిమా ఇది. దాదాపు 25 నిమిషాల సీజీ కనిపిస్తుంది. సన్ని మంచి పనితనాన్ని కనబరిచాడు. రుక్షర, వైశాలి చక్కగా నటించారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌ రైట్లను బాలాజీ, మంజునాథ్‌ తీసుకున్నారు. జనవరి 1న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.