గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (13:28 IST)

కమల్‌ చెప్పిన జీవిత సత్యం... ఎవరు మీలో కోటీశ్వరుడులో...

నటుడు కమల్‌ హాసన్‌లో చాలా కోణాలున్నాయి. ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలంటే సినిమాల గురించి కాకుండా ఇతర విషయాల గురించి అడిగితే చాలా క్లారిటీగా చెబుతాడు. తను చేసే సినిమా 'ఉత్తమ విలన్‌' గురించి టీవీలో మాట్లాడుతూ... ఆ క్లిప్పింగ్‌లు కూడా వేసేశాడు. అందులో తన గురువుగార్లయిన కె. బాలచందర్‌, కె. విశ్వనాథ్‌లు ఇద్దరూ నటించడం చాలా హ్యాపీగా వుందంటూ పేర్కొన్నారు. ఇన్ని సినిమాలు చేశారు. ఎన్నో రంగాల్లో బిజీగా వున్నా టైమ్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారనేందుకు.. చిన్నప్పటి క్రమశిక్షణ అని వివరించారు. 

 
ఇప్పటి యువతరానికి మీరిచ్చే సలహా ఏమిటని అడిగితే... ఏ రంగంలో వున్నవారైనా నెంబర్‌‌వన్‌లో వుండాలని చూసుకోవాలి. జీవితంలో ప్రతి పనినీ ఇంట్రెస్ట్‌తో చేయాలి. టాయిలెట్‌ క్లీనింగ్‌ తాను గనుక చేస్తే నెంబర్‌ 1 టాయిలెట్‌ క్లీనర్‌గా పేరు తెచ్చుకుంటానని ఇన్‌డైరెక్ట్‌గా యూత్‌నుద్దేశించి చెప్పారు. ఎవరి పనిని వారు గౌరవించాలి. 
 
నేను అలా నేను ఇలా అనేది మనస్సులోకి రానీయవద్దనే విషయాన్ని కమల్‌ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీలో ఎవరు కోటీశ్వరుడు చివరి ఎపిసోడ్‌లో ఆయన గెస్ట్‌గా వచ్చారు. ప్రతి గెస్ట్‌తో క్విజ్‌ను ఆడించే నాగార్జున కమల్‌తో ఆడించకుండా కమల్ జర్నీ గురించి చెప్పించడం ప్రత్యేకంగా వుంది.