మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : ఆదివారం, 4 జనవరి 2015 (17:54 IST)

బాబాయ్... అబ్బాయ్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం... ఎప్పుడొస్తుందో..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం రాబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టార్స్ సినిమాల హవా సాగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో నూతన చిత్రం తయారవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా మెగా హీరోల చిత్రాన్ని నిర్మిస్తారని కూడా తెలుస్తోంది.
 
ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు, వెంకటేష్‌ల కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల కాగా, పవర్ స్టార్ పవణన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో 'గోపాల గోపాల' ఈ నెల 9న విడుదల కానుంది. కాగా నాగార్జున, కార్తీల కాంబినేషన్‌లో మరో మల్టీ స్టార్స్ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. ఈ స్థితిలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో చిత్రం వస్తే ఇక చెప్పేదేముంది బంపర్ హిట్ కొట్టడం ఖాయం అని సినీ వర్గాల సమాచారం.