గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 27 జూన్ 2015 (14:31 IST)

మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో మంచు విష్ణు నిర్మాతగా భారీ చిత్రం

తన విలక్షణ నటనతో ప్రతినాయకుడు నుండి కథానాయకుడు వరకు ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి, ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు హీరోగా సినిమా ప్రారంభం కానుంది. ఈ తరంలో తన కామెడితో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన కామెడి స్టార్ అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.
 
మంచు మోహన్ బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని డిఫరెంట్ మూవీస్‌ను నిర్మిస్తూ నిర్మాతగా, హీరోగా అందరినీ మెప్పిస్తున్న మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.