బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 1 నవంబరు 2014 (14:10 IST)

దాసరికి వయసైపోయిందా...? అలా అనేవారికి... మోహన్ బాబు

ఎర్రబస్సు ఆడియోలో కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దర్శకరత్న దాసరి నారాయణరావును పొగడ్తల్లో ముంచేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ... దాసరికి వయసైపోయింది, ఇంకేం సినిమాలు తీస్తారు? అని చెప్పే చాలామందికి సమాధానమే ఈ ఎర్రబస్సు అని అన్నారు. 
 
'ఎర్రబస్సు' ఆడియో విడుదలలో మోహన్ బాబు మాట్లాడారు. "వయసు ఎవరికి అయిపోదు..? వయసు పెరుగుతున్నా నిబద్ధతతో ఆయన అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తారు. తెలుగు సినిమాలను నిర్మించి ఓ మార్క్ క్రియేట్ చేసింది దాసరి నారాయణ రావుగారు. కొన్ని వందల సినీ ఇళ్లలో దీపం వెలిగించారు. వందేళ్లపాటు దాసరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాల"ని మోహన్ బాబు వెల్లడించారు.