శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (16:00 IST)

ఆయన కులమేంటో నా కులమేంటో తెలీదు: మోహన్‌బాబు

మోహన్‌ బాబు సినీరంగానికి వచ్చి నలభై ఏళ్ళు అయింది. అదెలాగంటే తొలి సినిమా 'స్వర్గం నరకం' చిత్ర విడుదల తేదీని బేస్‌ చేసుకుని చెబుతున్నారు. 1974లో దాసరి నారాయణరావు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన కులమేంటో నా కులమేంటో తెలీదు. అవేవీ మాకు తెలీవు. అవకాశం ఇచ్చారు... చేశాను. భక్తవత్సలం పేరును మోహన్‌ బాబుగా మార్చారు. ఇప్పటికి 560 సినిమాలు  చేశాను. ఈ నెల 22కు 39 ఏళ్లు పూర్తయి 40 యేటలోకి నా సినీ కెరీర్ ప్రవేశించింది. ఎస్‌వి కృష్ణారెడ్డి 20 ఏళ్ళు దాటేశాడు. ఆయన సినిమాలో ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది. యముడిగా నటించాను. చాలా ఆనందంగా వుందని' మోహన్‌ బాబు అన్నారు. 
 
పై మాటలు 'యమలీల-2' సినిమా ఆడియో సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న సందర్భంలో శుక్రవారం రాత్రి వ్యాఖ్యానించారు. ఇందులో హీరోగా డా. సతీష్‌ నటించారు. ఆయన గురించి మాట్లాడుతూ... నేను 40 ఏళ్ళలో దాసరి గారు, ఎన్‌టిఆర్‌ గారు, అక్కినేని గారు నేర్పిన క్రమశిక్షణతోనే నడుచుకున్నాను. ఈ సినిమా హీరో సతీష్‌ కూడా ఆ క్రమశిక్షణ కన్పిస్తుంది. అని చెప్పారు.
 
దిల్‌ రాజు మాట్లాడుతూ.... 1994లో యమలీల రిలీజ్‌ అయినప్పుడు ప్రేక్షకుడిలా సినిమా చూశాను. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్‌ అయ్యాక... ఎస్‌వి కృష్ణారెడ్డి సినిమాలు చేయలేకపోయాను. ఇప్పుడు ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా షీల్డు అందుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల అవుతుందని ఎస్‌వి కృష్ణారెడ్డి చెప్పారు.