శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జనవరి 2015 (17:32 IST)

ఎంఎస్ నారాయణ ఆరోగ్యం ఎలా ఉంది...?

సంక్రాంతి వేడుకలకు స్వంత ఊరు భీమవరానికి వచ్చిన ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెపుతున్నారు.
 
కాగా ఎంఎస్ నారాయణ తన స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చారు. ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజని తేలడంతో ప్రధమ చికిత్స చేశారు. 
 
ఐతే ఆయనకు షుగర్ వ్యాధి కూడా ఉండటంతో అక్కడ నుంచి అత్యవసర చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంఎస్ కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.