శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (10:58 IST)

గోపాల గోపాలకు ముందే ముకుంద: బాబాయ్‌ని బీట్ చేసిన అబ్బాయ్!

పవన్ కల్యాణ్ నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ఇటీవలే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అలాగే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తొలి సినిమా 'ముకుంద' కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. దాంతో ఇది కొత్త హీరో వరుణ్ సినిమాకి పెద్ద మైనస్ అవుతుందని భావించారు. 
 
ఇద్దరు మెగా హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే అభిమానుల మధ్య గొడవలు తలెత్తుతాయనీ, అలా పోటీ మంచిది కాదనీ భావించిన మెగా ఫ్యామిలీ పెద్దలు 'ముకుంద' చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా, కాస్త ముందుకు అంటే డిసెంబర్ నెలాఖరుకు విడుదల చేసేలా తాజాగా ప్లాన్ చేసినట్టు సమాచారం.