గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (16:56 IST)

చక్రి కార్యాలయంపై దాడి: పోలీసులకు భార్య, బ్రదర్ ఫిర్యాదు!

దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి కార్యాలయంపై దాడి జరిగింది. శ్రీనగర్ కాలనీలోని చక్రి కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు ఆయన సోదరుడు మహిత్ నారాయణ నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
గతరాత్రి ఆఫీస్‌పై దాడి చేసిన దుండగులు అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, చక్రి భార్య శ్రావణి కూడా మంగళవారం ఉదయం పోలీస్ స్టేషనుకు వచ్చారు. ఆమె కూడా ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు సమాచారం.